ఎస్సీ అభివృద్ధి శాఖలో గ్రేడ్ 1 అధికారులకు పదోన్నతులు కల్పించండి..

by Kodari Anjali |

ఎస్సీ అభివృద్ధి శాఖలో వసతి గృహ సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 అధికారులుగా పని చేస్తున్న వారికి సహాయ సాంఘిక సంక్షేమ అధికారులుగా పదోన్నతులు కల్పించాలని టీజీఈజేఏసీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కు విజ్ఞప్తి చేశారు .

ఎస్సీ అభివృద్ధి శాఖలో గ్రేడ్ 1 అధికారులకు పదోన్నతులు కల్పించండి..
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: ఎస్సీ అభివృద్ధి శాఖలో వసతి గృహ సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 అధికారులుగా పని చేస్తున్న వారికి సహాయ సాంఘిక సంక్షేమ అధికారులుగా పదోన్నతులు కల్పించాలని టీజీఈజేఏసీ చైర్మన్ , టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో సహ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు కొండల్ రెడ్డి , గోవర్ధన్ రెడ్డి తదితరుల ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఎస్సీ అభివృద్ధి శాఖలో వసతి గృహ సంక్షేమ గ్రేడ్ 1 అధికారులుగా పని చేస్తున్న వారికి సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు (ఏఎస్ డబ్ల్యూఓ ) గా పదోన్నతులు దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నాయని, అర్హులైన వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని , తెలంగాణ రాష్ట్ర సబ్‌ఆర్డినేట్ సర్వీస్ రూల్స్‌లోని రూల్ 16(హెచ్) ప్రకారం అర్హులైన వారికి అతి త్వరలో పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రవి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, శ్రీకాంత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story