- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు విస్తరణ బాధితులకు ప్రత్యేక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
ఇందిరమ్మ గృహ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిల్లంచర్ల సతీష్ బుధవారం వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

దిశ, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనుల వల్ల ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ గృహ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిల్లంచర్ల సతీష్ బుధవారం హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో కేసముద్రం మున్సిపాలిటీలో రూ.500 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు గ్రామ ప్రజలు సంపూర్ణ సహకారం అందించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేసముద్రం విలేజ్‌లో 80 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టగా, సుమారు 60 కుటుంబాలు తమ ఇళ్లను పాక్షికంగా లేదా పూర్తిగా కోల్పోయాయని వివరించారు. బాధితుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, ఇళ్లు కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల రోడ్డు విస్తరణ బాధితుల పరిస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి, ఇందిరమ్మ గృహ పథకం కింద ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుడు మహమ్మద్ జావిద్ పాల్గొన్నారు.






