ఇద్దరు కుమార్తెలతో భర్త అదృశ్యం

by velandi.Saikiran |

కుటుంబ కలహాల నేపధ్యంలో ఇద్దరు కుమార్తెలతో సహా భర్త అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఇద్దరు కుమార్తెలతో భర్త అదృశ్యం
X

దిశ, మేడిపల్లి: కుటుంబ కలహాల నేపధ్యంలో ఇద్దరు కుమార్తెలతో సహా భర్త అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, బోడుప్పల్ అశోక్ నగర్ కు చెందిన భుక్య పూజ (25)కు మహేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 6న మధ్యాహ్నం మహేష్ తన ఇద్దరు కుమార్తెలు మానస్వి (5), యశస్విని (5)లను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం భార్య పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story