Axis Bank: యాక్సిస్ బ్యాంకులో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామా

by S Gopi |

సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు సీనియర్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఒకేసారి రాజీనామా చేయడం బ్యాంకింగ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

Axis Bank: యాక్సిస్ బ్యాంకులో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజ యాక్సిస్ బ్యాంక్‌లో లీడర్‌షిప్ సంక్షోభం తలెత్తింది. బ్యాంక్ అంతర్గతంగా తన కార్పొరేట్ విభాగంలో పెద్ద ఎత్తున రీస్ట్రక్చరింగ్ చేపడుతున్న తరుణంలో.. సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు సీనియర్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఒకేసారి రాజీనామా చేయడం బ్యాంకింగ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. యాక్సిస్ బ్యాంక్‌లో సుమారు 20 ఏళ్లుగా ఉంటూ ప్రభుత్వ సంస్థలు, ఫైనాన్షియల్ క్లయింట్లతో వ్యూహాత్మక సంబంధాలను నడిపిన ఇన్‌స్టిట్యూషనల్ హెడ్ అనిల్ అగర్వాల్‌తో పాటు, డెట్ క్యాపిటల్ మార్కెట్ (డీసీఎం) టీమ్‌ను నడిపించిన వికాస్ షిండే, ఫారెక్స్ ట్రేడింగ్ విభాగంలో కీలకమైన జిమ్మీ తవాడియాలు తమ పదవుల నుండి తప్పుకున్నారు. ఇటీవలే యాక్సిస్ బ్యాంక్ మాజీ సీఎఫ్‌వో పునీత్ శర్మను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన సీఎఫ్‌వోగా నియమించుకోవడం కూడా బ్యాంక్‌లో లీడర్‌షిప్ మార్పులపై చర్చకు దారితీసింది. అయితే ఈ రాజీనామాలపై యాక్సిస్ బ్యాంక్, సంబంధిత అధికారులు అధికారికంగా స్పందించలేదు.

Next Story