- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ పెట్రోలింగ్‌తో ఫేక్ ప్రొఫైల్స్ గుర్తింపు...
అమాయకులను నిండా ముంచేందుకు సైబర్ మోసగాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎర వేసేందుకు పన్నుతున్న కుట్రలను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 24/7 సైబర్ దునియా లో సైబర్ పోలీస్ గస్తిని నిర్వహిస్తుంది.

దిశ, సిటీ క్రైం: అమాయకులను నిండా ముంచేందుకు సైబర్ మోసగాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎర వేసేందుకు పన్నుతున్న కుట్రలను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 24/7 సైబర్ దునియాలో సైబర్ పోలీస్ గస్తిని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో సైబర్ మాయగాళ్లు మల్టీ లెవల్ మార్కెటింగ్,, పెట్టుబడులు, చిన్నారులపై ఫేక్ వెబ్ సైట్ లను రూపొందించి వాటితో భారీగా కోల్లగొట్టేందుకు సిద్దమయ్యారు. దీని కోసం సైబర్ చీటర్స్ 280 ప్రొఫైల్స్ సోషల్ మీడియాలో పెట్టి 310 ప్రకటనలను ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వీటిని గుర్తించి ఈ ప్రొఫైల్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని పోలీసులు పలు సోషల్ మీడియా వేదికల నిర్వాహకులకు లేఖలు రాశారు. వాటిని తొలిగించారు. అమాయకులు వీటి ట్రాప్ లో పడకుండా సైబర్ క్రైం పోలీసులు చెక్ పెట్టారు. ప్రజలు నిరంతరం సోషల్ మీడియాలో వచ్చే మోసపూరితా ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.






