- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ సొంతం
by Batti.Sumithra |
చిల్లరను చులకన చేయొద్దని మరోసారి నిరూపించాడు నల్గొండ జిల్లాకు చెందిన కొండే రఘుపతి.

X
దిశ, కనగల్ : చిల్లరను చులకన చేయొద్దని మరోసారి నిరూపించాడు నల్గొండ జిల్లాకు చెందిన కొండే రఘుపతి. చాలాకాలంగా రూ.10 నాణేలను ఒక్కొక్కటిగా పొదుపు చేసిన ఆయన, బుధవారం ఆ పొదుపుతోనే రూ.1.10 లక్షల విలువైన తన కలల బైకును కొనుగోలు చేశాడు. నాణేలతో నిండిన సంచులను షోరూంకు తీసుకెళ్లగా, సిబ్బంది గంటలపాటు వాటిని లెక్కించి మొత్తం సరైందని నిర్ధారించారు. అనంతరం రఘుపతికి కొత్త బైకును అందజేశారు. చిల్లర పొదుపుతో కలను నిజం చేసుకున్న రఘుపతిని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
Next Story






