- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flipkart: ఫ్యాషన్ విక్రయదారులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్
ఈ నిర్ణయంతో ప్లాట్‌ఫామ్‌లో ఉన్న సుమారు 90 వేల మంది యాక్టివ్ ఫ్యాషన్ సెల్లర్లు తమ అమ్మకాలపై వచ్చే లాభాలను పూర్తిగా నిలుపుకునే అవకాశం పొందుతారని కంపెనీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తన ఫ్యాషన్ విక్రయదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ.1,000 వరకు ధర ఉన్న ఫ్యాషన్ ఉత్పత్తులకే పరిమితమైన జీరో-కమిషన్ విధానాన్ని ఇకపై మొత్తం ఫ్యాషన్ కేటగిరీకి విస్తరించింది. దీంతో ధరతో సంబంధం లేకుండా అన్ని ఫ్యాషన్ ఉత్పత్తులపై సెల్లర్లు కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ నిర్ణయంతో ప్లాట్‌ఫామ్‌లో ఉన్న సుమారు 90 వేల మంది యాక్టివ్ ఫ్యాషన్ సెల్లర్లు తమ అమ్మకాలపై వచ్చే లాభాలను పూర్తిగా నిలుపుకునే అవకాశం పొందుతారని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంతో విక్రయదారులు కొత్త ఉత్పత్తులు తీసుకురావడం, తమ బ్రాండ్‌లను మరింత బలోపేతం చేయడంపై ఎక్కువగా పెట్టుబడి పెట్టగలరని ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ తిరానీ పేర్కొన్నారు. 2007లో ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్‌కు ప్రస్తుతం 50 కోట్లకు పైగా రిజిస్టర్ అయిన వినియోగదారులు, 14 లక్షలకు పైగా విక్రయదారులు ఉన్నారు. ఈ నిర్ణయం ఫ్యాషన్ విభాగంలో సెల్లర్లను ఆకర్షించడంతో పాటు, మార్కెట్‌ప్లేస్ పోటీని మరింత వేగవంతం చేసే అవకాశముంది.






