- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటిపారుదల, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర, రాష్ట్ర అధికారుల సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న వివిధ నీటిపారుదల, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

- పెండింగ్ అంశాలను వేగవంతం చేయాలని నిర్ణయం
- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ సంజయ్ జాజు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న వివిధ నీటిపారుదల, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. న్యూఢిల్లీలోని క్యాబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) మనోజ్ గోవిల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల తాజా పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సాగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని, ఉమ్మడి సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల సాంకేతిక, పరిపాలనాపరమైన అంశాలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కీలక వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొని ప్రాజెక్టుల వారీగా నివేదికలను సమర్పించారు.






