- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ జీవో ఉపసంహరించుకోవాలి: షర్మిల లేఖ
by Vemula.Srinu Prasad |
మున్సిపల్ కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవో నంబర్ 975ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల చెప్పారు. ...

X
దిశ, ఏపీ బ్యూరో: మున్సిపల్ కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవో నంబర్ 975ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల చెప్పారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రైవేటీకరణ పేరుతో మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను ప్రమాదంలోకి నెట్టడం సరికాదని, కార్మికుల జీవనాధారంతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కార్మిక ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
Next Story






