కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ లో టీ10 క్రికెట్ పోటీలు

by velandi.Saikiran |

న్యూ బోయినపల్లి కంటోన్మెంట్ గ్రౌండ్ లో ఓ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో టీ10 క్రికెట్ పోటీలు బుధవారం నిర్వహించారు.

కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ లో టీ10 క్రికెట్ పోటీలు
X

దిశ, తిరుమలగిరి: న్యూ బోయినపల్లి కంటోన్మెంట్ గ్రౌండ్ లో ఓ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో టీ10 క్రికెట్ పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లితండ్రులు,ఉపాధ్యా యులు విద్యార్థుల్లో చిన్న నాటి నుండే ప్రతిభను గుర్తించి క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల వల్ల విద్యార్థుల శరీర దారుడ్యం పెంపొందడమే కాకుండా మానసికోల్లాసంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ షేక్ జునైద్ అహ్మద్,కరస్పాండెంట్ మేడమ్ బిల్కీజ్ సుల్తానా,హెడ్ మాస్టర్ రాజు, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story