మావిగన్ వద్దు.. అమరావతి ముద్దు: మంత్రి అనగాని

by Vemula.Srinu Prasad |

ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వ లేదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసిపి మావిగాన్ అంటుందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు...

మావిగన్ వద్దు.. అమరావతి ముద్దు: మంత్రి అనగాని
X

దిశ, ఏపీ బ్యూరో: ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వ లేదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసిపి మావిగాన్ అంటుందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. సిఆర్డిఏ ద్వారా అమరావతి చుట్టుపక్కల ఉన్న విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుతో సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కనుక అమరావతి ముద్దు మావిగన్ వద్దని మంత్రి అనగాని నినదించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తాసిల్దార్ భవనాన్ని మంత్రి అనగాని సత్య ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి సభలో మాట్లాడుతూ వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

ఏ ఇద్దరు కలిసి ఉండటం వైసిపికి ఇష్టం ఉండదనీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే మావిగన్ అంటుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలోని ప్రజలు సైతం మావిగన్ వద్దు అమరావతి కావాలి అంటూ మంత్రి అనగాని తో కలిసి నినదించారు.గత వైసిపి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రీ సర్వేను అడ్డుపెట్టుకొని ప్రజల భూములు కొట్టేయాలని ప్లాన్ చేసిందని మంత్రి ఆరోపించారు.గత రెండేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వ పాపాలన్నిటిని కడుగుతున్నామన్నారు.

వైసీపీ ప్రభుత్వ కాలంలో అండర్ వేర్లు తయారు చేసే జాకీ తోపాటు అన్ని కంపెనీలు రాష్ట్రం నుండి పారిపోయినట్లు మంత్రి గుర్తు చేశారు.చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. కూటమి ప్రభుత్వ కృషి కారణంగా దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 26% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి అనగాని ప్రకటించారు.

Next Story