- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్లాపూర్‌లో గంజాయి స్వాధీనం.. సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్
గంజాయితో పట్టుబడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో జరిగింది.

దిశ, రామచంద్రాపురం: గంజాయితో పట్టుబడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో చోటుచేసుకుంది. కొల్లూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా, బిరిడియా మండలం, గంటస్వర్ అంకపాడా గ్రామానికి చెందిన బసుదేవ్ బెహరా (46) ప్రస్తుతం తెల్లాపూర్‌లోని ప్రణీత్ కియారా లేబర్ క్యాంప్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ నివాసం ఉంటున్నాడు. ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లిన బసుదేవ్ బెహరా అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుంచి సుమారు 300 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి తెల్లాపూర్‌లోని తన లేబర్ క్యాంప్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద గంజాయి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించి తనిఖీ చేయగా 300 గ్రాముల గంజాయి దొరికింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేయడంతోపాటు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కొల్లూరు పోలీసులు తెలిపారు.






