- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. కన్వెన్షన్‌కు నోటీసులు
by Kodari Anjali |
టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ కన్వెన్షన్ కు నోటీసులు జారీ చేసినట్లు నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపి ప్రసీద తెలిపారు.

X
దిశ, గండిపేట: టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ కన్వెన్షన్ కు నోటీసులు జారీ చేసినట్లు నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపి ప్రసీద తెలిపారు. 'అక్రమాలకు జీ హుజూర్' శీర్షికతో దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. నార్సింగి సర్కిల్ పరిధిలోని జనవాడ సమీపంలో శంకర్పల్లి ప్రధాన రహదారిపై 311 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి భారీ కన్వెన్షన్ నిర్మిస్తున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలతో దిశ పత్రికలో కథనం వెలువడిన విషయం తెలిసిందే. వట్టినాగులపల్లి గ్రామంలో అనుమతి లేని షెడ్లతో పాటు భారీ కన్వెన్షన్‌కు నోటీసులు బుధవారం జారీ చేసినట్లు ఏసీపి ప్రసీద తెలియజేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
Next Story






