ఏపీ డెమియాలజిస్టుల వాక్-ఇన్ ఇంటర్వూ తేదీ మార్పు

by Vemula.Srinu Prasad |

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఐడీఎస్‌పీ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న 13 ఎపిడెమియాలజిస్టు పోస్టుల వాక్-ఇన్ ఇంటర్వ్యూల తేదీని ముందుకు తీసుకొచ్చారు. ..

ఏపీ డెమియాలజిస్టుల వాక్-ఇన్ ఇంటర్వూ తేదీ మార్పు
X

దిశ‌, ఏపీ బ్యూరో: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఐడీఎస్‌పీ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న 13 ఎపిడెమియాలజిస్టు పోస్టుల వాక్-ఇన్ ఇంటర్వ్యూల తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) బుధవారం కారిజెండం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈనెల 13న నిర్వహిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఇంటర్వ్యూను ప్రభుత్వ మెమో మేరకు ఈనెల 11వ తేదీకి మార్చినట్లు తెలిపింది. అభ్యర్థులు 11వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంగళగిరిలోని ఏపీఎంఎస్‌ఆర్‌బీ కార్యాలయంలో జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని బోర్డు సూచించింది.

Next Story