గుప్తనిధుల కోసం రహస్య తవ్వకాలు.. 8 మంది పై కేసు

by Batti.Sumithra |   (  Updated:2026-07-08 13:01:48  IST  )

రెబ్బెన మండలంలోని ఖైర్‌గాం గ్రామపంచాయతీ పరిధిలోని ఎడవెల్లి గ్రామంలో గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేపట్టిన 8 మంది పై కేసునమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

గుప్తనిధుల కోసం రహస్య తవ్వకాలు.. 8 మంది పై కేసు
X

దిశ, రెబ్బెన : రెబ్బెన మండలంలోని ఖైర్‌గాం గ్రామపంచాయతీ పరిధిలోని ఎడవెల్లి గ్రామంలో గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేపట్టిన 8 మంది పై కేసునమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఎడవెల్లి గ్రామానికి చెందిన బామినిపల్లి తిరుపతి ఇంటి వెనుక భాగంలో సోమవారం రాత్రి పూజలు నిర్వహించి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి, తిరుపతితో పాటు అతని భార్య, మంచిర్యాల, చంద్రపూర్ ప్రాంతాలకు చెందిన మరికొందరి పై కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

Next Story