- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసిస్, అల్ ఖైదా లింకులు.. దేశవ్యాప్తంగా NIA విస్తృత తనిఖీలు
ఐసిస్, అల్ ఖైదా భావజాలంతో ఆన్లైన్లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్న కేసులో అరెస్టైన నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐసిస్, అల్ ఖైదా భావజాలంతో ఆన్లైన్లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్న కేసులో అరెస్టైన నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని వించిపేటలో ఉన్న ఒక నిందితుడి ఇంట్లో భారీ భద్రత నడుమ ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఉగ్రలింకుల కేసుకు సంబంధించి మరిన్ని కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, బిహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు.
ఈ ఏడాది మార్చి నెలలో విజయవాడకు చెందిన మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ అనే ముగ్గురు అనుమానితుల్ని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారితో పాటు ఇస్లామిక్ స్టేట్ (ISIS), అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ (AQIS) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మరో 9 మంది నిందితుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు తీవ్రత దృష్ట్యా దానిని NIAకు బదిలీ చేశారు. టెర్రర్ లింకుల కేసులో ఒక మహిళతో పాటు.. తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ లతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నిందితుల ఇళ్లలో జరిపిన తనిఖీల్లో కొన్ని కీలకమైన డిజిటల్ ఆధారాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.






