భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

by velandi.Saikiran |   (  Updated:2026-07-08 12:43:16  IST  )

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
X

దిశ, ఇబ్రహీంపట్నం: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్ తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కాశబోయిన అరుణ్(35)కు భార్య రోజాతో పది రోజుల కింద‌ట‌ చిన్న గొడవ జరిగింది. దీంతో తన ముగ్గురు పిల్లలతో క‌లిసి, తల్లిగారి ఇల్లు మెండోరాకు వెళ్లిపోయింది భార్య రోజా. ఇక తన భార్య తన ఇంటికి రావడం లేదని మనస్థాపానికి చెందిన అరుణ్, మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అరుణ్ పెద్దనాన్న కాశబోయిన బాబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఎస్సై న‌వీన్‌.

Next Story