కుటుంబ సభ్యుల చేతిలో యజమాని హత్య

by Batti.Sumithra |

మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఇంటి యజమానిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేసిన సంఘటన నిజమాబాద్ జిల్లా మోపాల్​ మండలంలో బుధవారం వెలుగుచూసింది.

కుటుంబ సభ్యుల చేతిలో యజమాని హత్య
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఇంటి యజమానిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేసిన సంఘటన నిజమాబాద్ జిల్లా మోపాల్​ మండలంలో బుధవారం వెలుగుచూసింది. భార్య, కొడుకు, కోడలి చేతిలోనే హత్యకు గురికావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోపాల్ మండలంలోని అమ్రాబాద్​ జీపీ పరిధిలోని కోక్యా నాయక్ తండాలో బానోత్​ హరి (50) మద్యంకు బానిస అయ్యాడు. అయితే తాగిన మత్తులో తరచూ తమను వేధిస్తున్నాడనే నెపంలో ఆయన కుటుంబీకులంతా కలిసి మంగళవారం రాత్రి బానోత్​ హరి గొంతు పిసికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు.

Next Story