అల్లు అర్జున్ మూవీని రిజెక్ట్ చేసిన ప్రీతిముకుందన్.. ఎందుకంటే?

by Chukka Sudharani |

తాజాగా వచ్చిన ‘బ్లాస్ట్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్.

అల్లు అర్జున్ మూవీని రిజెక్ట్ చేసిన ప్రీతిముకుందన్.. ఎందుకంటే?
X

దిశ, సినిమా: తాజాగా వచ్చిన ‘బ్లాస్ట్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్. మానసికంగా, శారీరకంగా దృఢమైన ఆడపిల్లగా ప్రీతి నటించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ రొమాంటిక్ డ్రామా ‘హృదయం మురళి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరోయిన్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘రాకా’ సినిమాలో అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్ని రాకా డైరెక్టర్ అట్లీ స్వయంగా తెలిపాడు. ‘హృదయం మురళి’ సినిమా ట్రైలర్ ఈవెంట్‌కు విచ్చేసిన అట్లీ మాట్లాడుతూ.. ‘రాకాలో ఒక కీలక పాత్ర కోసం ఫస్ట్ ప్రీతి ముకుందన్‌ను సంప్రదించాము. కానీ అప్పటికే ప్రీతి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్లు కుదరక అవకాశం వదులుకోవాల్సి వచ్చింది. అనంతరం ఆ పాత్రను నటి ఫెమినా జార్జ్‌కు ఇచ్చాము. అయితే.. ప్రీతి నటనకు నేను పెద్ద అభిమానిని. ‘రాకా’తో కలిసి పని చేసే అవకాశం మిస్ అయినా.. భవిష్యత్తులో తప్పకుండా ఆమెతో ఓ సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు అట్లీ.

Next Story