- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎంపిక
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) 2026-2028 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.

- రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఎంపికైన డా. నరహరి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) 2026-2028 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డా. బి. నరహరి మరోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సెక్రటరీ జనరల్‌గా డాక్టర్ ఆర్. లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారిగా డాక్టర్ ఎ. లక్ష్మీ నారాయణ ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యుల ఐక్యతకు, సమష్టి బలానికి నిదర్శనమని నూతన కార్యవర్గం పేర్కొంది. తమపై నమ్మకముంచి ఎన్నుకున్న ప్రాథమిక సభ్యులకు, యూనిట్ ప్రతినిధులకు, జనరల్ కౌన్సిల్ సభ్యులకు కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. వైద్యుల సంక్షేమం, వృత్తిపరమైన గౌరవ పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేసింది. ఉపాధ్యక్షులుగా డా. బి. ఉమాకాంత్ గౌడ్, డా. ఎ. కృష్ణారావు, డా. ఆర్. దీనదయాళ్, డా. సి.హెచ్. కళ్యాణ్... కార్యదర్శులుగా డా. జె. భూపేందర్ సింగ్ రాథోడ్, డా. ఎం. విష్ణువర్ధన్, డా. ఎ. విశాల్, డా. కె. రమేష్, డా. వి. రవి ప్రవీణ్ రెడ్డి ఎంపికయ్యారు.
తక్షణ ప్రాధాన్యతలు - డిమాండ్లు ఇవే..
ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీ తమ తక్షణ ప్రాధాన్యతలను ప్రకటించింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ లో పెండింగ్‌లో ఉన్న రీడిప్లాయ్‌మెంట్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని అధ్యక్షుడు డా. నరహరి డిమాండ్ చేశారు. వైద్యులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు, ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలన్నారు. పెరిఫెరల్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సేవలందిస్తున్న వైద్యులకు పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్తగా డీఎంహెచ్‌ఓ పోస్టులను మంజూరు చేయాలని.. వైద్యులకు టైమ్-బౌండ్ ప్రమోషన్లను పక్కాగా అమలు చేయాలన్నారు.






