- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూలై 10న విద్యాసంస్థల బంద్
జూలై 10న విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ అన్వర్ పిలుపునిచ్చారు.

దిశ, మేడిపల్లి : జూలై 10న విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ అన్వర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సమితి ప్రకటించింది. ఈ సందర్భంగా ఉప్పల్ డిపోలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎండీ అన్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జూలై 10న జరిగే బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్, జిల్లా నాయకులు కృష్ణ, మహేష్, శ్రీకాంత్, వంశీ, అభి, వినయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






