- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిట్యాలలో రూ.2.11 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం
మండలంలోని చిట్యాల గ్రామ ప్రజల రెండు దశాబ్దాల విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది.

దిశ, తాడ్వాయి : మండలంలోని చిట్యాల గ్రామ ప్రజల రెండు దశాబ్దాల విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. రూ.2.11 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. గత ఏడాది మే 2, 2025న ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఏడాది కాలంలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో చిట్యాల, సంతాయిపేట్, సోమారం, అన్నారం తండా గ్రామాల్లోని విద్యుత్ సమస్యలు తీరనున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించాం. ఇకపై ఈ ప్రాంత రైతులకు, గృహ వినియోగదారులకు, చిన్న తరహా పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకే మా ప్రాధాన్యత అని పేర్కొన్నారు. తమ ఏళ్లనాటి కలను నిజం చేసిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అభినందించారు. అనంతరం నందివాడ గ్రామంలో చెరువు కట్ట అభివృద్ధి పనులను పరిశీలించి, కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, మండల అధ్యక్షుడు సంజీవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






