అటవీ ఉత్పత్తుల కనిష్ట ధరలపై పునః సమీక్ష: డాక్టర్ సయ్యద్ ఆరిఫ్ వలీ

by Kodari Anjali |

అటవీ ఉత్పత్తుల కనిష్ట ధరలను పునః సమీక్షించడంతో పాటు మార్కెట్ పరిస్థితులను అనుకూలంగా దోహదపడుతుందని ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ సయ్యద్ ఆరిఫ్ వలీ అన్నారు.

అటవీ ఉత్పత్తుల కనిష్ట ధరలపై పునః సమీక్ష: డాక్టర్ సయ్యద్ ఆరిఫ్ వలీ
X

దిశ, ఖమ్మం: అటవీ ఉత్పత్తుల కనిష్ట ధరలను పునః సమీక్షించడంతో పాటు మార్కెట్ పరిస్థితులను అనుకూలంగా దోహదపడుతుందని ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ సయ్యద్ ఆరిఫ్ వలీ అన్నారు. అటవీ కనిష్ట ధరలపై బుధవారం కొత్తగూడెంలోని అటవీశాఖ భద్రా మీటింగ్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... 87 రకాల చిన్న అటవీ ఉత్పత్తుల్లో ప్రస్తుతం ఉన్న కనిష్ఠ ధరలపై టేరి ఆధ్వర్యంలో సర్వే చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు‌. గిరిజనులకు అటవీ ఉత్పత్తుల పై న్యాయమైన ధరలు కల్పించేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు గిరిజన ప్రాంతాల్లో సర్వే చేయడం జరుగుతుందన్నారు. అనంతరం చీఫ్ కన్జర్వేటర్ బీమా నాయక్ మాట్లాడుతూ‌‌... టేరి ఆధ్వర్యంలో నిర్వహించే అటవీ ఉత్పత్తుల ధరల సర్వే గిరిజనులకు ఎంతో దోహదపడుతుందని అయన అన్నారు‌. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ జిల్లా అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సమ్మయ్య, టేరి బాధ్యులు నేహా శర్మ, చందన్ కౌర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story