విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదగాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వన్

by Batti.Sumithra |

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థునులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదగాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వన్
X

దిశ, గాంధారి : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థునులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో వన ఉత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వివరించారు. కావున వీటిని విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

మహిళలు ఆర్థిక స్వావాలంబన దిశగా అడుగులు వేయాలి..

మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని మహిళలకు సూచించారు. డ్వాక్రా గ్రూపులో లోన్ తీసుకొని నిర్వహిస్తున్న గోల్డెన్ బేకరీ ని ఆయన పరిశీలించారు. ఈ విధంగా డ్వాక్రా గ్రూపులలో రుణాలు పొందిన మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందడం ఆనందంగా ఉందన్నారు.

ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలి..

తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లు నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరా మహిళను లబ్ధిదారుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా అధికారులు తగిన కృషి చేయాలని సూచించారు.

ఓటర్ నమోదు సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

ప్రభుత్వం చేపడుతున్న ఓటర్ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఇప్పటికే ఓటర్లకు అందజేసిన ఫారాలను త్వరగా నింపి బీఎల్ఓలకు అందజేయాలని ఆయన ప్రజలను కోరారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే, తమ దగ్గరికి వచ్చే బీఎల్ఓలను పూర్తి వివరాలు అడిగిఅందులో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధారి సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్, మండల ప్రత్యేక అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్, హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, గాంధారి ఎమ్మార్వో రేణుక చావన్, ఎంపీడీవోరాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story