వంద మంది కొత్త నటులతో ‘కొత్త సినిమా’

by Chukka Sudharani |

సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్.. లోకల్ టాలెంట్‌తో స్థానికంగా రూపొందించిన సినిమా ‘కొత్త సినిమా’.

వంద మంది కొత్త నటులతో ‘కొత్త సినిమా’
X

దిశ, సినిమా: సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్.. లోకల్ టాలెంట్‌తో స్థానికంగా రూపొందించిన సినిమా ‘కొత్త సినిమా’. ఈ సినిమాతో ఏకంగా వంద మంది న్యూ టాలెంట్ వెండితెరకు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చరణ్ అర్జున్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన 'మేము కూడా సినిమా తీసినామురో..' పాటను ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ.. ‘మేము కింద స్థాయి నుంచి వచ్చామని చాలా మంది చెబుతుంటారు. మేము ఇంకా కింద స్థాయి నుంచి భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిలోంచి వచ్చాం. చీకటిలో వెలికితీసే బొగ్గు నుంచి వెలుగు పంచే ప్రాంతం రామగుండం నుంచి వచ్చిన వాళ్లం. ఈ సినిమాతో వందమంది కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నా. మన ఊరిలోనే ఉంటూ మన ఊరివాళ్లతో సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేశా. ఇంతమంది కొత్త వాళ్లను మీ ముందుకు తీసుకొచ్చా. మీరందరూ సరోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

Next Story