ఘోర ప్రమాదం: కూలిన నాలుగు అంతస్తుల భవనం

by Naga Rani Yarlagadda |

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోహిణి సెక్టార్ 16 ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.

ఘోర ప్రమాదం: కూలిన నాలుగు అంతస్తుల భవనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోహిణి సెక్టార్ 16 ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కాగా.. భవన శిథిలాల కింద పలువురు వ్యక్తులు చిక్కుకుని ఉంటారని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కూలిపోయిన భవనం చాలా పాతదిగా ఉన్నట్లు సమాచారం. ఆ భవనంలో కొన్ని మరమ్మతు పనులు చేస్తుండగా.. అకస్మాత్తుగా కుప్పకూలినట్లు స్థానికులు చెప్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తూ.. లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మునిసిపల్ అధికారులు సైతం రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు? ఎవరికైనా ప్రాణనష్టం జరిగిందా? అనే విషయాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. బాధితుల పరిస్థితి, ఆస్తి నష్టం, ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story