- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి : ఎంపీ గోడం నగేష్
కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు.

దిశ, బెజ్జూర్ : కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో బుధవారం సిర్పూర్(టి) ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుతో కలిసి బెజ్జూర్ మండలంలోని భారగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షలు, పోతేపల్లి గ్రామంలో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రం నిధులతో 42 శాఖల్లో రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. బెజ్జూర్ మండలంలోని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్న రోడ్లకు త్వరలో అటవీ అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రభుత్వం దివాలా తీసిందన్నారు.
కేంద్రం ఇచ్చే నిధుల వల్లనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధులే దిక్కన్నారు. పోతేపల్లి గ్రామంలో కరెంట్ సమస్యను, సైడ్ డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చింతలమానేపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యను తీర్చేందుకు గూడెం గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లో-వోల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బెజ్జూర్ మండలంలో ఐదు చెక్‌డ్యాంలు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే రెండు చెక్‌డ్యాంల నిర్మాణాలకు టెండర్లు పూర్తి చేసినట్లు తెలిపారు. చెక్‌డ్యాంల ద్వారా రైతాంగానికి సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సర్పంచులు తేలి సుశీల, రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, నాయకులు పాల్వాయి సుధాకర్ రావు, కొండ్ర మనోహర్ గౌడ్, కొప్పుల శంకర్, జాడి దిగంబర్, భిక్షపతి, తేలి బాపు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.






