రుజువైతే రాజీనామా చేస్తా: అఖిల ప్రియ సవాల్

by Vemula.Srinu Prasad |

నంద్యాల జిల్లా అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్‌ నెలకొంది. అహోబిలం ఆలయం తలనీలాల వ్యవహారంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ముడుపు అందుతున్నాయని గుంగుల బ్రిజేంద్రరెడ్డి అలియాస్ నాని వ్యాఖ్యానించారు..

రుజువైతే రాజీనామా చేస్తా: అఖిల ప్రియ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District) అహోబిలం(Ahobilam)లో పొలిటికల్ హైటెన్షన్‌ నెలకొంది. అహోబిలం ఆలయం తలనీలాల వ్యవహారంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ(Mla Bhuma Akhila Priya)కు ముడుపు అందుతున్నాయని గుంగుల బ్రిజేంద్రరెడ్డి అలియాస్ నాని(Gungula Brijendra Reddy, alias Nani) వ్యాఖ్యానించారు. ఇటీవల అందకపోవడంతో తల నీలాల తరలింపును ఆమె అడ్డుకున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. దీంతో భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు. అహోబిలంలో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు రుజువైతే రాజీనామా చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా అఖిల ప్రియ అహోబిలం చేరుకున్నారు. చర్చకు రాకుంటే గంగుల ఇంటికి వెళ్లాలని అఖిలప్రియ భావిస్తున్నారు. మరోవైపు తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని గుంగుల నాని తెలిపారు. తన వద్ద ఆధారాలున్నాయని ఆయన అంటున్నారు. దీంతో నంద్యాలలో అఖిల ప్రియ వర్సెస్ గంగుల నానిగా మారింది. మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు. నంద్యాలలో భారీగా మోహరించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Next Story