గచ్చిబౌలి ఎఫ్ సి ఐ లేఅవుట్‌ ను సందర్శించిన హైడ్రా, సిఎంసి కమిషనర్లు

by Kodari Anjali |

గచ్చిబౌలి ఎఫ్‌సీఐ లేఅవుట్ కబ్జాలను క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిఎంసీ కమిషనర్ సృజన పరిశీలించారు.

గచ్చిబౌలి ఎఫ్ సి ఐ లేఅవుట్‌ ను సందర్శించిన హైడ్రా, సిఎంసి కమిషనర్లు
X

దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి ఎఫ్‌సీఐ లేఅవుట్ కబ్జాలను క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిఎంసీ కమిషనర్ సృజన పరిశీలించారు. లేఔట్ లో కబ్జాకు గురైన రోడ్లు, పార్కులను బాధితులతో కలిసి తనికి చేశారు.రెండు దశాబ్దాలుగా నలుగుతున్న లేఅవుట్ వివాదం పరిష్కరించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లేఅవుట్‌లోని 40 అడుగులు, 25 అడుగుల రోడ్లను సైతం కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన యంత్రాంగం.. రోడ్లు, పార్కుల స్థలాలను రీ-మార్కింగ్ చేసే అవకాశం ఉంది.గతంలో ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల చేపట్టిన తిరిగి నిర్మించారు.సంధ్యా కన్వెన్షన్ పరిసరాల్లో రోడ్ల ఆక్రమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అక్రమ కట్టడాల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.. స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం

రంగనాధ్ మాట్లాడుతూ..

గచ్చిబౌలి జంక్షన్ దగ్గర సంధ్య కన్వెన్షన్ పక్కన ఉన్న ఎఫ్. సీ. ఐ. లే అవుట్ ను హైడ్రా, సిఎంసీ, రెవిన్యూ అధికారులు కలిసి సంయుక్తంగా సందర్శించామన్నారు. ఈ లే అవుట్ 1981 లో వేశారు, దాదాపు 160 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. కొంతకాలం క్రితం సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి ఈ లే అవుట్ ను మొత్తం డిస్ట్రబ్ చేసి రోడ్లు, పార్క్ స్థలాలు, కొన్ని ప్లాట్స్ ను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ప్లాట్ ఓనర్లు హైడ్రా ను ఆశ్రయించడం తో సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాం. హై కోర్ట్ లో స్టెటస్ కొ ఆర్డర్ కూడా ఉంది.. కోర్ట్ ఆర్డర్ ను లెక్కచేయకుండా మళ్ళీ నిర్మాణాలు చేపడుతున్నాడని ప్లాట్ ఓనర్స్ మరోసారి హైడ్రా ను సిఎంసీనీ ఆశ్రయించడం తో పరిశీలించడానికి వచ్చామని వివరించారు. కోర్ట్ ఆర్డర్ ను బేకతారు చేస్తూ, లే అవుట్ ను డిస్టర్బ్ చేస్తూ దౌర్జన్యంగా, చట్టాలంటే గౌరవం లేకుండా నిర్మాణలు చేస్తున్నారు. వీటి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. కోర్ట్ ఆదేశాల ప్రకారం రోడ్లు, ఓపెన్ స్పేస్ లను హైడ్రా కాపడుతుందనీ హెచ్చరించారు.

Next Story