- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేటీ బచావో.. బేటీ పడావోపై మహిళా శిశు సంక్షేమ అధికారి అవగాహన
ఆడపిల్లలకు విద్య, భద్రత, సాధికారత కల్పించడమే బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె. లలిత కుమారి అన్నారు.

దిశ, ఝరాసంగం: ఆడపిల్లలకు విద్య, భద్రత, సాధికారత కల్పించడమే బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె. లలిత కుమారి అన్నారు. బుధవారం ఝరాసంగం మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే చట్టం, మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లు, సామాజిక మాధ్యమాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆడపిల్లల ప్రాముఖ్యత, విద్య అవసరం, మహిళల భద్రత, సాధికారత తదితర అంశాలపై విద్యార్థినులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి, జిల్లా శిశు సంరక్షణ అధికారి, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త, వైద్యాధికారి, సఖి కేంద్రం ప్రతినిధులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, పోలీసు శాఖ సిబ్బంది, జెండర్ నిపుణులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.






