- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుణెలో చెత్త గుట్ట బీభత్సం.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం, శిథిలాల కింద 16 మంది!
పుణె సమీపంలోని పింప్రి చించ్వాడ్‌లో బుధవారం ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పుణె సమీపంలోని పింప్రి చించ్వాడ్‌లో బుధవారం ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎడతెరిపి లేని భారీ వర్షాల ధాటికి కొండంత ఉన్న ఓ భారీ చెత్తకుప్ప జారిపడి.. పక్కనే ఉన్న మూడు అంతస్తుల పరిపాలనా భవనంపై పడింది. దీంతో ఆ భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 15 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికుల సమాచారం. మోచీ ప్రాంతంలోని పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు (PCMC) చెందిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాసెసింగ్ ప్లాంట్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఎలా జరిగింది..?
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వర్షాల వల్ల చెత్తకుప్ప (Legacy Waste) వదులై పక్కనే ఉన్న ఆఫీస్ భవనంపై కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చెత్తను ప్రాసెస్ చేస్తున్న ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు ప్రమాద సమయంలో భవనంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటివరకు నలుగురిని సురక్షితంగా రక్షించినట్లు తెలిసింది.
ముమ్మరంగా సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. మేయర్ రవి లాండ్గే, మున్సిపల్ కమిషనర్ విజయ్ సూర్యవంశీ, పోలీస్ కమిషనర్ వినోయ్ కుమార్ చౌబే స్వయంగా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






