- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమా: మంత్రి ఆనం
హింధువుల మనోభావాలను అవమానిస్తూ వ్యా్ఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ కు మద్దతిస్తారా అంటూ వైసీపీ నేతలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: హింధువుల మనోభావాలను అవమానిస్తూ వ్యా్ఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ కు మద్దతిస్తారా అంటూ వైసీపీ నేతలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందూ ప్రజల మనోభావాలు ముఖ్యం కాదా తమకు అంటూ మండిపడ్డారు. అమరావతి సచివాలయంలో మాట్లాడిన ఆయన రావణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దా అని ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఎవరైనా సరే పరిమితంగా మాట్లాడాలని, అలా కాదని మత విద్వేషాలు రెచ్చకొట్టకూడదని సూచించారు. హిందూమతాన్ని కించపర్చుతూ మాట్లాడి రావణ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రశ్న రావణ్‌కు, మాజీ సీఎం జగన్ కు ఎవరు అధికారమిచ్చారని ప్రశ్నిచారని ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం హిందూమతాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారా అని నిలదీశారు. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే ఊరుకునేది లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు.






