రుషికొండ భవనాల వినియోగంపై పిల్.. వాదనలు

by Vemula.Srinu Prasad |

రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ కొనసాగింది. విశాఖ మాజీ కార్పొరేటర్ మూర్తియాదవ్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంను దాఖలు చేశారు..

రుషికొండ భవనాల వినియోగంపై పిల్.. వాదనలు
X

దిశ, వెబ్ డెస్క్: రుషికొండ భవనాల(Rushikonda Buildings) వినియోగంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ కొనసాగింది. విశాఖ మాజీ కార్పొరేటర్ మూర్తియాదవ్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంను దాఖలు చేశారు. భవనాల ప్రస్తుత స్థితి, భవిష్యత్తు ప్రణాళికలపై కోర్టులో వాదనలు సాగాయి. రుషికొండ భవనాలను పర్యాటక రంగ అవసరాల కోసం వినియోగించేందుకు గానూ ప్రతిపాదనలను ఆహ్వానించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ ప్రతిపాదనలు అందిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ భవనాలను ఏ సంస్థకూ కేటాయించలేదని, అలాంటి ఆలోచన లేదని కోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం.. పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

Next Story