- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శత్రువుని సైతం ప్రేమించే తత్వం వైఎస్సార్ సొంతం : సి.భాస్కర్ రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాజకీయ, వ్యాపార ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాజకీయ, వ్యాపార ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన Excel Security Services అధినేత సి. భాస్కర్ రెడ్డి, తన భార్య రూప, పిల్లలు తన్మయ్, తేజ్ దీప్ రెడ్డి, తేజస్వి లు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆయన మన మధ్య లేకపోయినా.. పంచిన ప్రేమాభిమానాలు, మధుర స్మృతులు, మార్గదర్శకాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
వైఎస్సార్ హయాంలో ఏ పథకం తీసుకువస్తే ఎంతమందికి మేలు జరుగుతుందని ఆలోచించేవారని అలాంటి నేతను కోల్పోవడం మనందరి దురదృష్టమని భావోద్వేగం చెందారు.అధికారంలో ఉన్న ప్రతిక్షణం జనం గురించే ఆలోచించిన ఆయన.. అధికారాన్ని ఒక సేవగా చూశారన్నారు. జనహృదయ నేతగా.. అందరిలోనూ చిరస్మరణీయంగా మిగిలిపోయారని, ఆయన లేనిలోటును ఎవ్వరూ తీర్చలేరని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శత్రువుని సైతం ప్రేమించే తత్వం వైఎస్సార్ సొంతమని కొనియాడారు. సంక్షేణం, అభివృద్ధిలనే రెండు కళ్లుగా చేసుకుని, దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం అని కితాబిచ్చారు.






