అజయ్ దేవ్‌గన్ ‘గోల్మాల్-5’ సినిమాలో విలన్‌గా నేషనల్ అవార్డ్ హీరోయిన్!

by Mallepaka Hamsa |

ది ఫ్యామిలీ మ్యాన్', 'ఆర్టికల్ 370', 'యమదొంగ' వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అజయ్ దేవ్‌గన్ ‘గోల్మాల్-5’ సినిమాలో విలన్‌గా నేషనల్ అవార్డ్ హీరోయిన్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ కామెడీ ఫ్రాంచైజీ ‘గోల్‌మాల్’ ఐదో భాగం షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2026లో ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటివరకు విడుదలైన నాలుగు భాగాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో ఈ ఐదో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, శ్రేయాస్ తల్పాడే, తుషార్ కపూర్, కునాల్ ఖేములతో పాటు మొదటి భాగం తర్వాత మళ్లీ ఈ ఫ్రాంచైజీలోకి తిరిగి వచ్చిన శర్మన్ జోషి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘గోల్‌మాల్-5’లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈసినిమాను చిత్రబృందం వచ్చే ఏడాది 2027 ప్రారంభంలో థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ హీరోయిన్ ప్రియమణి విలన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఆర్టికల్ 370', 'యమదొంగ' వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ నవ్వులు పూయించే ఈ సినిమాలో ప్రియమణి లాంటి ప్రతిభావంతురాలైన నటి విలన్‌గా చేస్తుండటంతో.. దర్శకుడు రోహిత్ శెట్టి ఆమె పాత్రను ఎంత వినోదాత్మకంగా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టితో ప్రియమణికి ఇది మొదటి కలయిక కాదు. గతంలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో సూపర్‌హిట్ అయిన ‘1 2 3 4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్’ అనే స్పెషల్ సాంగ్‌లో ఆమె రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే మెరిశారు. అలాగే హీరో అజయ్ దేవగన్‌తో కలిసి ఆమె 'మైదాన్' చిత్రంలో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో వెండితెరపై స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే ఈ ఐదో భాగంలో పాత నటీనటులైన జానీ లీవర్, సంజయ్ మిశ్రా, ముఖేష్ తివారీ, అశ్విని కల్సేకర్ మళ్లీ అలరించబోతున్నారు.

Next Story