- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్‌లో ప్రతి అర్హత కలిగిన ఓటరు భాగస్వామి కావాలి : మాజీ ఎమ్మెల్యే
by Batti.Sumithra |
ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

X
దిశ, నడిగూడెం : ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం తన స్వగ్రామమైన కరివిరాలలో నిర్వహించిన ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ఫారాన్ని పూరించి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ఓటర్లు నిర్ణీత గడువులోపు తమ వివరాలను నమోదుచేసుకోవాలని సూచించారు. అలాగే బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నరసింహారావు, సుఖేష్, బీఎల్‌వో సరిత, నాయకులు మారుతి, ఉపేందర్, నంబర్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






