- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొల్లపాడు రేషన్ షాపులో ఆకస్మిక తనిఖీలు
by Jakkula.Mamatha |
ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలోని ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలోని ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా దుకాణంలో రెండు కాంటాలు (తూనిక పరికరాలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని పరీక్షించగా తూనికలో కిలోకు పైగా వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దుకాణంలో వినియోగిస్తున్న తూనిక పరికరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించారు. తూనికలో భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో సంబంధిత డీలర్‌పై తూనికలు, కొలతల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీలత తెలిపారు. విచారణ అనంతరం నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
Next Story






