- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ పశువుల రవాణా వాహనం పట్టివేత
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసు స్టేషన్ అధికారి జి. మన్మథ కుమార్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది ఎం.సందీప్, శ్రీహరి వాహన గస్తీ నిర్వహిస్తుండగా, అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో కొయ్యలగూడెం వంతెన వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఒక సరుకు రవాణా వాహనాన్ని పరిశీలించారు. అందులో మొత్తం 37 పశువులు ఉన్నాయి. వాటిలో 32 ఆవులు, 5 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. వాహనం నడుపుతున్న వ్యక్తిని సికింద్రాబాద్‌లోని లాలాగూడకు చెందిన ఎస్.కె.అలీపాషా (42)గా గుర్తించారు. ఖమ్మం జిల్లా పనితాపురం పశువుల సంతలో కొనుగోలు చేసిన ఈ పశువులను షాద్‌నగర్‌లోని సర్దార్‌నగర్‌కు తరలిస్తున్నట్లు అతను తెలిపాడు. ఈ ఘటన పై స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మథ కుమార్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






