- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూటాన్ తో ఈసీఐఎల్ సంస్థ ఒప్పందం
ఈసీఐఎల్ సంస్థ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్ తో వాణిజ్య ఒప్పందం కుదిరింది.

దిశ, కాప్రా: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్ తో వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఈసీఐఎల్ సంస్థ సరఫరా చేసేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బుధవారం భూటాన్ రాజధాని తింపు లో ఎలక్షన్ కమిషనర్ సోనం పెల్డెన్ తాయే, ఈసీఐఎల్ సంస్థ సిఎండి, డైరెక్టర్ టెక్నికల్ డాక్టర్ అనీష్ కుమార్ శర్మ ఇరువురు ఒప్పంద పత్రాలను ఇచ్చి పుచ్చుకున్నారు. భూటాన్ దేశంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహించేందుకు ఈసీఐఎల్ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తీసుకుంటున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్ భూటాన్ డైరెక్టర్ గోవిందా సుబేది, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సోనం వంగడా, ఈసీఐఎల్ ఈవీఎం డివిజన్ ఇన్చార్జ్ లెఫ్ట్నల్ కల్నల్ ఆర్ఎస్ బీన్స్ (రిటైర్డ్), తదితరులు పాల్గొన్నారు.






