సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిల్‌ దాఖలు అయింది..

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు(Saikrishna custodial death case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ(CBI)కి ఇవ్వాలని హైకోర్టు(High Court)లో పిల్‌ దాఖలు అయింది. ఈ పిల్‌(Pill)పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదిక ఇవ్వాలని కోరింది. అంతేకాదు 3 వారాల్లోగా నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేశారు. తదుపరి విచారణ 3 వారాల పాటు వాయిదా వేసింది.

కాగా సాయికృష్ణ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌(Vijayawada Krishnalanka Police Station)లో లాకప్ డెత్ అయ్యారు. ఇందుకు కారణం సీఐ నాగరాజు అని సిట్ గుర్తించింది. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ఇంకా కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నారు. అంతేకాదు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది.

Next Story