- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురుగు ప్రవాహంతో టీకేఆర్ కాలేజీ రహదారి దయనీయ స్థితి
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ పరిధిలో ఉన్న టీకేఆర్ కాలేజీ ప్రధాన రహదారి గత వారం రోజులుగా మురుగు నీటి ప్రవాహంతో దయనీయ స్థితికి చేరుకుంది.

దిశ, హస్తినాపురం: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ పరిధిలో ఉన్న టీకేఆర్ కాలేజీ ప్రధాన రహదారి గత వారం రోజులుగా మురుగు నీటి ప్రవాహంతో దయనీయ స్థితికి చేరుకుంది. రోడ్డుపై నిరంతరం మురుగు నీరు పారుతుండటంతో కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీకేఆర్ కాలేజీ ప్రధాన గేటు సమీపంలో రహదారి పూర్తిగా దెబ్బతిని పెద్దఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆ గుంతల్లో వర్షపు నీటితో పాటు మురుగు నీరు నిల్వ ఉండటంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొనగా, నడిచి వెళ్లే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ప్రధాన రహదారి దుస్థితిపై..
మురుగు నీటి దుర్వాసనతో పరిసర ప్రాంత ప్రజలు అసౌకర్యానికి గురవుతుండటంతో పాటు దోమలు, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ప్రయాణించే ఈ ప్రధాన రహదారి దుస్థితిపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ నగర్ బస్తీ వాసులు మాట్లాడుతూ, వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మురుగు నీటి సమస్యను పరిష్కరించి, దెబ్బతిన్న రహదారిని మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని వారు సంబంధిత అధికారులను కోరుతున్నారు.






