నేడు గట్టుప్పలపల్లికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి, వాకిటి శ్రీహరి

by Kodari Anjali |

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి మంత్రి పొంగులేటి, మంత్రి వాకిటి శ్రీహరి రానున్నారు.

నేడు గట్టుప్పలపల్లికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి, వాకిటి శ్రీహరి
X

దిశ, తలకొండపల్లి: కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం సాయంత్రం 5 గంటలకు రానున్నారు. ఇటీవల మిడ్జిల్‌లో జరిగిన కృతజ్ఞత బహిరంగ సభలో అస్వస్థతకు గురై అనంతరం నేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎద్దుల శంకర్ (శ్రీకాంత్) కుటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

Next Story