- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఇద్దరు స్టార్స్‌తో పూర్తిస్థాయి ప్రేమకథ చేయాలని ఉంది: రుక్మిణి వసంత్
ఖచ్చితంగా సూర్య సార్, ధనుష్ సార్‌లతో కలిసి ఒక పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నట్లు రుక్మిణి వసంత్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ‘సప్త సాగరాలు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ ఊహించని విధంగా మారిపోయింది. దీంతో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఆ తర్వాత మదరాసి, అప్పుడో ఇప్పుడో, ఎప్పుడో వంటి చిత్రాలు పెద్దగా రాణించలేకపోయాయి. కానీ గత ఏడాది వచ్చిన కాంతార చాప్టర్-1 వంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. అంతేకాకుండా సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్న ఆమె, మరోవైపు రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో ఒక కీలక పాత్ర పోషించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
పలు వాయిదాల తర్వాత ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోందిఇదిలా ఉంటే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్యపై తనకున్న గాఢమైన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నటుడు సూర్య అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు. ముఖ్యంగా ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణ’ వంటి తమిళ క్లాసిక్ సినిమాలో ఆయన పోషించిన మిలిటరీ ఆఫీసర్ పాత్ర తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. అంతేకాదు, ఆయనకు ప్రపోజ్ చేయాలని ఉందంటూ ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఖచ్చితంగా సూర్య సార్, ధనుష్ సార్‌లతో కలిసి ఒక పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నట్లు రుక్మిణి వసంత్ తన మనసులోని మాటను బయటపెట్టారు.






