- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఖానాపూర్‌లో ఎస్ఐఆర్ సవరణ అవగాహన ప్రత్యేక శిబిరం
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డు ప్రజల కోసం ప్రత్యేక అవగాహన శిబిరాన్ని ఈ నెల 9న ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం పేర్కొన్నారు.

దిశ, ఖానాపూర్: కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డు ప్రజల కోసం ప్రత్యేక అవగాహన శిబిరాన్ని ఈ నెల 9న ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం పేర్కొన్నారు. ఉదయం 11:00 గంటలకు పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలోని అంగన్వాడీ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరంలో బీఎల్వో, సూపర్‌వైజర్లు షబ్బీర్ పాషా, ద్యావతి రాజేశ్వర్‌తో పాటు వివిధ వార్డుల బృందాలు పాల్గొంటాయని ఆయన తెలిపారు.11వ వార్డులోని రెండు బూతుల ఓటర్లకు ఎస్ఐఆర్ ఫారాలు నింపేందుకు పూర్తి సాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలాంటి సందేహాలు ఉన్న శిబిరానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని ఆయన పట్టణ ప్రజలను కోరారు.






