- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారంతా చనిపోయారు.. మత్స్యకారుల గల్లంతుపై ప్రభుత్వానికి నివేదిక
జులై 4వ తేదీన చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న మత్స్యకారుల బోటు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో బోటులో ఏడుగురు మత్స్యకారులుండగా. ఒక మత్స్యకారుడు మాత్రమే బోటును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.

దిశ, వెబ్‌డెస్క్: జులై 4వ తేదీన చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న మత్స్యకారుల బోటు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో బోటులో ఏడుగురు మత్స్యకారులుండగా.. ఒక మత్స్యకారుడు మాత్రమే బోటును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. సముద్రంలో గల్లంతైన మరో ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్టుగార్డులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మూడు రోజులుగా తీవ్రంగా గాలించినా.. ఫలితం లేకపోయింది. ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ దొరక్కపోవడంతో.. ప్రభుత్వానికి త్రిసభ్య నిజనిర్థారణ కమిటీ నివేదిక సమర్పించింది. గల్లంతైన ఆరుగురు జాలర్లు మృతి చెందినట్లుగా నిర్థారిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. కాగా.. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారమే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు తక్షణ సాయంగా ప్రకటించగా.. మంత్రి కొల్లు రవీంద్ర ఆ చెక్కుల్ని బాధిత కుటుంబాలకు అందజేశారు.






