ఆలేరు మండల ఫ్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల నియామక ఉత్తర్వులు జారీ

by Batti.Sumithra |   (  Updated:2026-07-08 11:38:37  IST  )

విద్య–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బాల్యం సంరక్షణ, పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ విభాగం ప్రారంభానికి సంబంధించి ఆలేరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆలేరు మండల ఫ్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల నియామక ఉత్తర్వులు జారీ
X

దిశ, ఆలేరు : విద్య–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బాల్య సంరక్షణ, పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగం ప్రారంభానికి సంబంధించి ఆలేరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ బిక్షపతి ఆర్‌సీ నం. 2984/ఏ2/ప్రీ-ప్రైమరీ/2026 ద్వారా ఈ ఉత్తర్వులు వెలువరించారు. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, కొలనుపాకకు ఇన్‌స్ట్రక్టర్‌గా బొడ్డు అశ్విని, ఆయాగా బి. రేణుక, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, గొలన్‌కొండకు ఇన్‌స్ట్రక్టర్‌గా జేరిపోతుల అశ్విని, ఆయాగా జే. కవిత, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, బహదూర్‌పేటకు ఇన్‌స్ట్రక్టర్‌గా అంగడి అరుణ, ఆయాగా ఎస్. స్వప్న, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, శ్రీనివాసపురానికి ఇన్‌స్ట్రక్టర్‌గా మచ్చ రజిత, ఆయాగా ఇరావలి, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, టంగుటూరుకు ఇన్‌స్ట్రక్టర్‌గా ఎస్. రేణుక, ఆయాగా గజరాజు శిరీషలను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొత్తం 17 మండలాలైన ఆలేరు, అడ్డగూడూరు, ఆత్మకూరు (ఎం), భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, బి. పోచంపల్లి, చౌటుప్పల్, గుండాల, మోటకొండూరు, మోత్కూర్, నారాయణపూర్, రాజాపేట, రామన్నపేట, తుర్కపల్లి, వలిగొండ, యాదగిరిగుట్ట మండలాల్లో మొత్తం 61 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 61 మంది ఆయాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story