మీరు ఇవ్వలేదు.. మేమే కొట్లాడి తెచ్చుకున్నాం.. తాడిచెర్ల బ్లాక్-2 పై భట్టి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపుపై బీజేపీ వాదనలను డిప్యూటీ సీఎం భట్టి ఖండించారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం దీనిని కేటాయించిందన్నారు.

మీరు ఇవ్వలేదు.. మేమే కొట్లాడి తెచ్చుకున్నాం.. తాడిచెర్ల బ్లాక్-2  పై భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తాటిచెర్ల కోల్ బ్లాక్-2 విషయంలో వార్ మొదలైంది. తాడిచెర్ల-2 కోల్‌ సింగరేణి కి కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వేలం లేకుండానే తాటిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని బీజేపీ చేస్తున్న వాదనను భట్టి ఖండించారు. దీంతో తాజాగా కోల్ బ్లాక్ పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది.

కొత్తగా మీరు చేసిందేంటి?

ఇవాళ మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ బ్లాక్‍ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని ఇందులో బీజేపీ ప్రభుత్వం కొత్తగా అలాట్ చేసిందేంటని ప్రశ్నించారు. అయితే గతంలోనే కేటాయిస్తే 2013 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టారన్నారు. బ్లాక్ కేటాయింపు జరిగింది.. మైనింగ్ లీజు కోసం అనుమతి ఇవ్వలేదన్నారు.

తెలంగాణపై ప్రేమ ఉండే ఆ పని చేయండి:

కొత్త యాక్ట్ ప్రకారం తాడిచర్ల -2 సింగరేణికి ఇవ్వబోమని చెప్పారు. కానీ యాక్ట్ రావడానికి ముందే సింగరేణికి తాడిచర్ల-2 కేటాయించారనే ఈ విషయాలను మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి వాస్తవాలను వారి ముందు ఉంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి అనుమతులు తెచ్చిందని ఇప్పటికైనా అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే సింగరేణి పరిధిలోని గనులన్నీ సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.

Next Story