అప్పుల బాధతో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

by velandi.Saikiran |

మండల పరిధిలోని వెంకటం పల్లి గ్రామంలో అప్పులు ఎక్కువై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది

అప్పుల బాధతో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
X

దిశ, ఖిల్లా గణపురం: వెంకటం పల్లి గ్రామంలో అప్పుల బాధ‌తో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వెంకటం పల్లి గ్రామానికి చెందిన సిద్దే చంద్రయ్య కుమారుడు రాము ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టారు. స్లాబ్ లేవల్ వరకు ఇల్లు పూర్తయింది. తల్లి అంజలమ్మ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కావడంతో బిల్లు వస్తుందని ఆశపడ్డాడు. బిల్లు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారితో అప్పులు కూడా చేశాడు. అప్పుల విషయమై తల్లిదండ్రులతో గొడవపడిన రాము, ఈద్గా వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story