- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టమోటా లోడ్ లారీ బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం
తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. టమోటా లోడ్‌తో వేగంగా వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ..

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati) భాకరాపేట ఘాట్ రోడ్డు(Bhakarapeta Ghat Road)లో ఘోర ప్రమాదం తప్పింది. టమోటా లోడ్(Tomato load)తో వేగంగా వెళ్తున్న మినీ లారీ(Mini lorry) అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అన్నమయ్య జిల్లా రాయచోటి (Annamayya District Rayachoti)నుంచి టమోటా లోడ్‌తో తిరుపతి మార్కెట్(Tirupati Market)కు వెళ్తుండగా భాకరాపేట ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. దీంతో లారీలోని టమోటా బాక్సులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, లారీ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు అందించారు. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. క్రేన్ సహాయంతో బోల్తా పడిన లారీని పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






