- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు సృష్టించిన గొట్టిపర్తి జెడ్పీహెచ్‌ఎస్
ఈ ఏడాది విద్యార్థులను బడికి రప్పించడంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని పేర్కొంటూ తుంగతుర్తి మండలం గొట్టిపర్తి జెడ్పీహెచ్‌ఎస్ యాజమాన్యం బుధవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది.

దిశ, తుంగతుర్తి : ఈ ఏడాది విద్యార్థులను బడికి రప్పించడంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని పేర్కొంటూ తుంగతుర్తి మండలం గొట్టిపర్తి జెడ్పీహెచ్‌ఎస్ యాజమాన్యం బుధవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధానోపాధ్యాయుడు పిల్లుట్ల శ్రీహరి నేతృత్వంలో విద్యార్థులంతా కలిసి 103 సంఖ్య ఆకారంలో వరుసగా నిలబడి తమ ఆనందాన్ని పంచుకున్నారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో 79 మంది విద్యార్థులు ఉండగా, పదో తరగతిలో 16 మంది ఉత్తీర్ణులయ్యారు.
దీంతో పాఠశాలలో కేవలం 63 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన వేసవి సెలవులను ఉపాధ్యాయులందరూ బడిబాట కార్యక్రమానికి వినియోగించుకున్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా లక్ష్యసాధన కోసం కృషి చేయడంతో కొత్తగా 40 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య 103కు చేరి పాఠశాల రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు పిల్లుట్ల శ్రీహరి "దిశ"తో మాట్లాడుతూ, సర్పంచ్ చిలుకల మంజుల–వెంకన్న, ఉపసర్పంచ్ అన్నెబోయిన శ్రీకాంత్, ఉపాధ్యాయుల అంకితభావం, గ్రామస్థుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఎస్‌ఏ (సాంఘిక శాస్త్రం) ఉపాధ్యాయ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు.






